మహబూబాబాద్ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌పై బదిలీ వేటు.. రాజకీయాల్లో భాగమేనా?
- ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు శరత్‌చంద్ర అల్లుడు
- ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రేఖానాయక్‌కు దక్కని చోటు
- శరత్‌చంద్ర స్థానంలో గుండేటి చంద్రమోహన్ నియామకం
మహబూబాబాద్ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు శరత్‌చంద్ర అల్లుడు. బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రేఖానాయక్‌కు చోటు లభించలేదు. దీంతో కినుక వహించిన ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరత్‌చంద్ర బదిలీ ప్రాధాన్యం సంతరించుకుంది.
శరత్‌చంద్రను తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. 26 డిసెంబరు 2021లో మహబూబాబాద్ ఎస్పీగా శరత్‌చంద్ర బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడాయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ (కమాండ్ కంట్రోల్) ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న గుండేటి చంద్రమోహన్‌ను నియమించారు.