టీడీపీ మద్దతు ఇచ్చే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది: నారా లోకేశ్

  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో యువగళం
  • చింతలపూడిలో పామాయిల్  రైతులతో లోకేశ్ ముఖాముఖి
  • చింతలపూడి ప్రాజెక్టు వద్ద లోకేశ్ సెల్ఫీ చాలెంజ్
మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 197వ రోజు చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొనసాగింది. అభిమానుల షేక్ హ్యాండ్లతో ఎడమ భుజం తీవ్రంగా బాధిస్తున్నప్పటికీ లోకేశ్ అలాగే ముందుకు సాగారు. సుందరరావుపేట క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర లింగపాలెం, వెలగపల్లి, ఫాతిమాపురం, చింతలపూడి మీదుగా తీగలవంచ విడిది కేంద్రం వరకు పాదయాత్ర సాగింది. చింతలపూడిలో పామాయిల్ రైతులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు.

నారా లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

మిషన్ మోడ్ లో పామాయిల్ పంటను ప్రోత్సహిస్తాం

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పామాయిల్ మొక్కలు ఉచితంగా అందిస్తాం, మిషన్ మోడ్ లో పామాయిల్ పంటను ప్రోత్సహిస్తాం, డైనమిక్ ప్రైసింగ్ పాలసీ తీసుకురావడం కోసం కృషి చేస్తాం. పామాయిల్ బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. పామాయిల్ నర్సరీ ఏర్పాటు చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మెరుగైన పాలసీలను అధ్యయనం చేసి బోర్డు ఏర్పాటు చేస్తాం. 

పామాయిల్ ని రాష్ట్రానికి పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. మెట్ట ప్రాంతం రైతుల అభివృద్ది కోసం ఆనాడే ఆలోచించి పామాయిల్ రైతులను ప్రోత్సహించింది ఎన్టీఆర్. పామ్ ఆయిల్ రైతులను ఆదుకున్నది, పామాయిల్ రేట్లు పడిపోయినప్పుడు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంది చంద్రబాబు.

చింతలపూడి ప్రాజెక్టును నాశనంచేశారు

చింతలపూడి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని చంద్రబాబు పనిచేస్తే జగన్ ఆ ప్రాజెక్టును నాశనం చేశాడు. చింతలపూడి ప్రాజెక్టులో ఒక్క తట్ట మట్టి కూడా తియ్యలేదు. 

జగన్ కి జే బ్రాండ్ లిక్కర్ అంటే ఇష్టం, ఇసుక అంటే ప్రేమ... కానీ రైతులు, వ్యవసాయం అంటే ద్వేషం. పామాయిల్ రైతులకు సబ్సిడీలో మొక్కలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందజేశాం. పామాయిల్ రైతులకు జగన్ ప్రభుత్వం చేసింది గుండు సున్నా.

పామాయిల్ రైతులూ బాధితులే

దేశంలోనే ఎక్కువ పామాయిల్ పండిస్తోంది మన రాష్ట్రమే. కానీ, జగన్ పాలనలో పామాయిల్ రైతులు కూడా బాధితులుగా మారారు. మొక్కలు, ఎరువులు, పురుగుల మందులు, యంత్రాలు, పనిముట్లు దేనికి సబ్సిడీ రావడం లేదు. 

నాడు టీడీపీ కేంద్రంతో సంప్రదింపులు చేసి పామాయిల్ పై దిగుమతి సుంకం 49 శాతం విధించే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు కేంద్రం దిగుమతి సుంకం ఎత్తేయడంతో పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే, ఎంపీలు పట్టించుకోవడం లేదు. 

రికవరీ రేటు పెంపుదలకు కృషిచేస్తాం

పామాయిల్ మొక్కలు ఉచితంగా అందించాలి అనే లక్ష్యంతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కల రకాలు అభివృద్ది చేస్తాం. ఇతర దేశాల్లో పామ్ ఆయిల్ రికవరీ రేటు 22 శాతం ఉంటే ఇక్కడ కేవలం 15.5 శాతమే ఉంది. దీనిని పెంచడానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. 

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో అమలు అవుతున్న రేటు ఇప్పించి ఆదుకున్నారు. టీడీపీ వచ్చాక హామీలు నెరవేరుస్తాం. కేంద్రంలో కూడా టీడీపీ మద్దతు ఇచ్చే పార్టీనే అధికారంలోకి వస్తుంది.

పెట్టుబడులు తగ్గించేందుకు చర్యలు

పామాయిల్ పెట్టుబడి తగ్గించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. కేంద్రం సబ్సిడీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా జగన్ ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం వాటా ఇవ్వకపోవడంతో పామ్ ఆయిల్ రైతులకు సబ్సిడీలు అందడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్, పరికరాలు, యంత్రాలు కూడా అందిస్తాం.

రైతు కళ్లలో ఆనందమే టీడీపీ లక్ష్యం. టీడీపీ హయాంలో ఎప్పుడు గిట్టుబాటు ధర సమస్య వచ్చినా చంద్రబాబు ఉదారంగా ఆదుకొనే వారు. జగన్ పాలనలో అసలు వ్యవసాయ శాఖ ఉందా అనే అనుమానం వస్తుంది. పామ్ ఆయిల్ పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.

చింతలపూడి ప్రాజెక్టు వద్ద లోకేశ్ సెల్ఫీ చాలెంజ్

జగన్మోసపురెడ్డి మాటలకు, చేతలకు పొంతన ఉండదనడానికి నిలువెత్తు నిదర్శనం చింతలపూడి ఎత్తిపోతల పథకం. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా మెట్టప్రాంతంలో రైతులకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం విస్తరణ పనులను శరవేగంతో పరుగులు తీయించారు దార్శనిక నేత చంద్రబాబునాయుడు. 

దీని ద్వారా రెండు జిల్లాల్లోని 33 మండలాల్లో 4.80 లక్షల ఎకరాలకు నీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్ల అంచనాలతో పనులు చేపట్టి, అధికారం నుంచి వైదొలగేనాటికి రూ.2,289 కోట్లు ఖర్చుచేశాం. ప్రాజెక్టు విస్తరణకు భూసేకరణ సమయంలో నిర్వాసిత రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి రెచ్చగొట్టిన జగన్... అధికారంలోకి వచ్చాక పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు. 

కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు... ఉన్న ఎత్తిపోతల పథకాలకు కరెంటుబిల్లులు కట్టలేక పాడుబెడుతున్నారు. విధ్వంసకుడు జగన్ అరాచకానికి, చేతల మనిషి చంద్రన్న సమర్థతకు అద్దం పడుతోంది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.


*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2646.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 22.7 కి.మీ.*

*198 వరోజు (29-8-2023) యువగళం వివరాలు*

*పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా)*

ఉదయం

8.00 – తీగలవంచ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.30 – తీగలవంచలో స్థానికులతో సమావేశం.

9.10 – పాదయాత్ర పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.15 – టి.నర్సాపురం అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులతో సమావేశం.

10.45 – టి.నర్సాపురం ఎస్సీ కాలనీలో దళితులతో సమావేశం.

11.05 – గురవాయిగూడెంలో స్థానికులతో మాటామంతీ.

మధ్యాహ్నం 

12.35 – వేపగుంటలో స్థానికులతో సమావేశం.

1.05 – శ్రీరామవరంలో భోజన విరామం.

2.00 – పోలవరం నిర్వాసితులతో సమావేశం.

సాయంత్రం

4.00 – శ్రీరామవరం నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.15 – శ్రీరామవరంలో స్థానికులతో సమావేశం.

5.45 – తిరుమలదేవిపేటలో స్థానికులతో సమావేశం.

రాత్రి

7.15 వెంకటాపురంలో స్థానికులతో సమావేశం.

8.15 – బొర్రంపాలెంలో స్థానికులతో సమావేశం.

9.00 – బొర్రంపాలెం శివారు విడిది కేంద్రంలో బస.

*******



More Telugu News