ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వుల జారీ

  • మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఏపీపీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ
  • గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గ్రూప్ 1లో 89 పోస్టులు, గ్రూప్ 2లో 508 పోస్టులను భర్తీ చేస్తారు. 

గ్రూప్ 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగాలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రూప్ 2 కేటగిరీ కింద డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్ సెక్షన్ అఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ III, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ IIతో సహా పలు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అనుమతి మంజూరు అయింది.


More Telugu News