నేను ప్రయాణిస్తున్న విమానం కూలిపోవచ్చు.. వైరల్ అవుతున్న ప్రిగోజిన్ గత ఇంటర్వ్యూ
- రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం నేత ప్రిగోజిన్
- ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మృతి
- రష్యానే చంపేసిందంటూ విమర్శలు
- కొట్టిపడేసిన రష్యా.. ప్రిగోజిన్ చనిపోయినట్టు అధికారికంగా ధ్రువీకరణ
‘‘నేను ప్రయాణిస్తున్న విమానం కూలిపోవచ్చు’’ ఈ మాటలన్నది మరెవరో కాదు.. ఇటీవల విమాన ప్రమాదంలో మృతి చెందిన యెవ్‌గెనీ ప్రిగోజిన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రైవేటు సైన్యం వాగ్నర్ చీఫ్ అయిన ప్రిగోజిన్ ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు పూర్తిగా సహకరించారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడి తీరుపై తిరుగుబాటు చేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ప్రిగోజిన్ సహా పదిమంది ప్రాణాలు కోల్పోయారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు చేసిన తనకు ప్రాణగండం పొంచి ఉందని తెలుసుకాబట్టే ఆయనీ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. ఏప్రిల్ 29న ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రిగోజిన్ మరణం తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రిగోజిన్ మృతి వెనక పుతిన్ హస్తం ఉందని ఇప్పటికే ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడీ వీడియో వెలుగులోకి రావడంతో అది మరింత బలపడింది.
‘‘రష్యా ఈ రోజు విపత్తు అంచున ఉంది. ‘కాగ్’లను సర్దుబాటు చేయకుంటే విమానం మధ్యలో కూలిపోవచ్చు’’ అని ఆ ఇంటర్వ్యూలో ప్రిగోజిన్ పేర్కొన్నారు. ‘‘మేమిప్పుడు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాం. నేనెందుకు ఇంత నిజాయతీగా మాట్లాడుతున్నానంటే.. ఈ దేశంలో జీవించేవారి ముందు బతికే హక్కు నాకు లేదు. ఇప్పుడు వారు అబద్ధాలు చెబుతున్నారు. దానికంటే నన్ను చంపడం మంచిది’’ అని అందులో పేర్కొన్నారు.
‘‘నేను మాత్రం అబద్ధాలు చెప్పడం లేదు. రష్యా విపత్తు అంచున ఉందని నిజాయతీగా చెప్పగలను. ‘కాగ్’లను సర్దుబాటు చేసుకోకుంటే విమానం గాల్లో ఉండగానే కుప్పకూలిపోవచ్చు’’ అని ప్రిగోజిన్ పేర్కొన్నారు. కాగా, విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోయి ఉండకపోవచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, రష్యా నిన్న అధికారికంగా ప్రిగోజిన్ మరణాన్ని ధ్రువీకరించింది. అలాగే, అతడి మరణం వెనక కుట్ర ఉందన్న వార్తలను కొట్టిపడేసింది.