ట్రంప్‌పై కాసుల వర్షం కురిపిస్తున్న మగ్‌షాట్

  • టీషర్టులు, కాఫీ మగ్‌లు, బీర్ కూజీలు తదితర వాటిపై ట్రంప్ మగ్‌షాట్ ఫొటో
  • విరగబడి కొంటున్న జనం
  • విరాళాల ద్వారా రెండు రోజుల్లో ట్రంప్‌కు రూ. 58 కోట్లు
2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్టై ఆ వెంటనే బెయిలుపైన విడుదలైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాసుల వర్షం కురుస్తోంది. గత గురువారం జార్జియా జైలులో లొంగిపోయిన ట్రంప్‌కు నిందితులకు తీసినట్టుగానే జైలు అధికారులు ‘మగ్‌షాట్’ తీశారు. ఇప్పుడా ఫొటో యమా క్రేజీగా మారిపోయి ట్రంప్‌కు డబ్బులు ఆర్జించి పెడుతోంది. ట్రంప్ మగ్‌షాట్‌తో కూడిన టీషర్టులు, బీర్ కూజీలు, కాఫీ మగ్‌లు, బంపర్ స్టిక్కర్లు, పోస్టర్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఆ ఫొటో కింద ‘నెవ్వర్ సరెండర్’ (ఎప్పుడూ లొంగిపోవద్దు) అనే క్యాప్షన్‌ను కూడా ముద్రించారు.

అలాగే, జైలు అనంతర పరిమాణాల తర్వాత గత రెండు రోజుల్లోనే ట్రంప్‌కు దాదాపు రూ. 58 కోట్ల (71 లక్షల డాలర్లు) విరాళాలు అందాయి. ఈ విషయాన్ని ట్రంప్ ఎన్నికల ప్రచారం బృందం ధ్రువీకరించింది. కాగా, జైలులో మగ్‌షాట్ తీయించుకున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డులకెక్కారు.


More Telugu News