మోసం చేయడం అనే సబ్జెక్టులో కేసీఆర్ పీహెచ్ డీ చేశారు: ఖమ్మం సభలో బండి సంజయ్

  • ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా సభ
  • హాజరైన అమిత్ షా
  • తన ప్రసంగంలో విమర్శలు గుప్పించిన బండి సంజయ్
  • మోసం చేయడంలో కేసీఆర్ ను మించినవాళ్లు లేరని వెల్లడి 
  • సీఎం కేసీఆర్ పేరు ఎక్కడన్నా చెబితే ఉన్న గౌరవం కూడా పోతుందని వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ఖమ్మం సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వాడీవేడి ప్రసంగం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

మోసం చేయడంలో కేసీఆర్ ను మించిన వాళ్లెవరూ లేరని అన్నారు. మోసం అనే సబ్జెక్టులో కేసీఆర్ పీహెచ్ డీ చేశారని వ్యంగ్యం ప్రదర్శించారు. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అని అన్నారు. నాడు ఎన్టీఆర్ టికెట్ ఇవ్వకపోడంతో ఆయనను ఆకట్టుకునేందుకు కొడుకు అజయ్ రావు పేరును కేటీఆర్ గా మార్చాడని విమర్శించారు. 

"రాష్ట్ర ముఖ్యమంత్రిది ఒక్కటే లెక్క... ఒక పెగ్ వేస్తాడు... ఇంటికో ఉద్యోగం అంటాడు, రెండు పెగ్గులు వేస్తాడు... డబుల్ బెడ్రూం ఇళ్లు అంటాడు, మూడు పెగ్గులు వేస్తాడు... దళితులకు మూడెకరాలు అంటాడు, నాలుగు పెగ్గులు వేస్తాడు... దళిత బంధు అంటాడు, ఐదు పెగ్గులు వేస్తాడు... నేను ఏమీ అనలేదంటాడు. అలాంటి వాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎలా భరిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని? ఈ ముఖ్యమంత్రి పేరు ఎక్కడన్నా చెబితే ఉన్న గౌరవం కూడా పోతుంది. 

ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, అప్పులు తీరాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంలోని బీజేపీ తెలంగాణను ముందుకు తీసుకెళుతుంది. పేదల బతుకులు బాగుపడాలంటే రామరాజ్యం రావాలి, మోదీ రాజ్యం రావాలి. అందుకోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం" అంటూ  బండి సంజయ్ పిలుపునిచ్చారు.


More Telugu News