కరోనా నుంచి కోలుకున్న ప్రతీ వందమంది పేషెంట్లలో ఆరుగురు ఏడాదిలోపే మృతి
- ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న ఏడాదిలోగా మరణం
- వెల్లడించిన ఐసీఎంఆర్ పరిశోధనా పత్రం
- దాదాపు 15 వేల మంది రోగులను పరిశీలించిన నిపుణులు
కరోనాతో ఆసుపత్రి పాలైన వారిలో తక్కువ మంది రోగులు కోలుకుని ఇంటికి చేరుకున్నారు.. అయితే, వారిలోనూ కొందరు ఏడాదిలోపే మరణించారని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇలా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన కరోనా రోగుల్లో ప్రతీ వంద మందిలో ఆరుగురికి పైగా ఏడాదిలోపే చనిపోయారని తేలింది. ఈమేరకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఓ పరిశోధనా పత్రాన్ని తాజాగా విడుదల చేసింది. ఇండియన్ మెడికల్ జర్నల్ ఈ రీసెర్చ్ రిపోర్టును ప్రచురించింది.
ఆసుపత్రులలో చేరి కోలుకున్న 14,419 మంది కరోనా రోగులను నాలుగు వారాల నుంచి ఏడాది పాటు పరిశీలించినట్లు ఐసీఎంఆర్ నిపుణులు తెలిపారు. వీరిలో 942 మంది (6.5%) ఏడాదిలోపే చనిపోయారని చెప్పారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత సగటున 28 రోజులకు చనిపోయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. అయితే, ఇలా చనిపోయిన వారిలో 73 శాతం మంది ఏదో ఒక దీర్ఘ కాలిక వ్యాధి బాధితులేనని, 27.4 శాతం మంది కనీసం ఒక్క డోసు టీకా అయినా తీసుకున్న వారేనని వివరించారు. తాజా అధ్యయనం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా ప్రాణాంతకంగా మారుతోందని తేలిందన్నారు. అయితే, వైరస్ బారిన పడకముందు కొవిడ్ టీకా తీసుకుంటే ప్రాణాపాయం కొంత తగ్గే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పరిశోధకులు తెలిపారు.