'చంద్రముఖి 2'లో నాకు అవకాశం ఇవ్వమని నేనే అడిగాను: కంగనా రనౌత్
- కంగనా ప్రధాన పాత్రధారిగా 'చంద్రముఖి 2'
- ఆమెను సెట్లో చూసి టెన్షన్ పడ్డానన్న లారెన్స్
- కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణమని వ్యాఖ్య
- సెప్టెంబర్ 15న విడుదల కానున్న సినిమా
రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో అలరించున్నారు. సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోన్న అగ్ర నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'వినాయక చవితి' సందర్భంగా ‘చంద్రముఖి 2’ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో లారెన్స్ మాట్లాడుతూ .. "నా ప్రతీ సినిమా ఈవెంట్‌లో నా సోదరులతో కార్యక్రమం చేయిస్తుంటాను. అందుకు కారణం .. వారికి డాన్స్ తప్ప మరేదీ రాదు. వాళ్లు ఇంత మాత్రం కష్టపడకపోతే వాళ్ల కుటుంబం పస్తులుండాల్సిందే. వాళ్లు నా సినిమా స్టేజ్‌పై పెర్ఫామెన్స్ చేసినప్పుడు మరెవరైనా చూసి వాళ్లకు మరేదైనా ఫంక్షన్స్‌లో అవకాశం ఇవ్వకపోతారా? అనేదే నా అభిప్రాయం’’ అన్నారు. తాను నిర్వహిస్తోన్న ఛారిటీ సంస్థకు నిర్మాత సుభాస్కరన్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు.
'చంద్రముఖి' సినిమా గురించి ప్రస్తావిస్తూ ‘‘పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ 'చంద్రముఖి 2' వంటి ఓ గొప్ప సినిమాను లార్జర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. ఆయన బ్యానర్‌లో సినిమా చేయటం ఎంతో గర్వంగా ఉంది. ఇక మా డైరెక్టర్ వాసుగారి గురించి చెప్పాలంటే ఆయనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ‘చంద్రముఖి 2’ను కూడా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా సాధించే విజయం ఆయనకే దక్కుతుంది" అన్నారు. "కంగనా రనౌత్‌గారు ఈ సినిమాలో నటిస్తారని తెలియగానే ఆశ్చర్యపోయాను. ఆమె చాలా బోల్డ్ పర్సన్. ఆమె ఎలా ఉంటారోనని టెన్షన్ పడ్డాను. ఆమె సెట్స్‌లోకి గన్‌మెన్స్‌తో సహా వచ్చారు. అప్పుడు నాలో ఇంకా భయం పెరిగిపోయింది. తర్వాత నా రిక్వెస్ట్ మేరకు ఆమె గన్ మెన్స్‌ను సెట్ బయటే ఉంచారు. అప్పటి నుంచి ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయటం ప్రారంభించాను. అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయారు" అని చెప్పారు.
ఇక కీరవాణిగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వర్క్‌ను టెన్షన్‌లా ఫీలై చేయరు. ఈ సినిమాతో నాకు ఆవిషయం అర్థమైంది. అలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు కాబట్టే అంత మంచి సంగీతాన్ని మా సినిమాకు అందించారు. సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిగారు, ఎడిటర్ ఆంటోని సహా ఎంటైర్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’’ అన్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ ‘‘నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేయలేదు. అసలు విషయమేమంటే.. నాకు అవకాశం కావాలని ఎవరినీ అడగలేదు. తొలిసారి డైరెక్టర్ పి.వాసుగారినే అడిగాను. ఈ సినిమాలో వాసుగారు నా పాత్రతో పాటు ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. లారెన్స్ మాస్టర్ చాలా మందికి పెద్ద ఇన్‌స్పిరేషన్" అన్నారు.
డైరెక్టర్ పి.వాసు మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గా ఇప్పటి దర్శకులతో పోటీ పడాలనే ఆలోచిస్తుంటాను. ఆ కోణంలో ఆలోచించే 'చంద్రముఖి 2'ను రూపొందించాను. సుభాస్కరన్‌గారు తమిళ చిత్ర సీమకు దొరికిన గొప్ప నిధి. ఓ టెక్నీషియన్‌గా నా జర్నీ ప్రారంభమై నాలుగు దశాబ్దాలు అయిన విషయం మీరు చెప్పేంత వరకు నాకు తెలియలేదు. దర్శకుడిగా నేను చేసిన ప్రయాణంలో నాకు తమ సపోర్ట్ అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు, నటుడిగా నన్ను ఆదరించిన వారికి ధన్యవాదాలు. చంద్రముఖి 2ని లారెన్స్‌తో చేస్తున్నామని రజినీకాంత్‌గారికి చెప్పగానే సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆయన అన్నారు.
'చంద్రముఖి' సినిమా గురించి ప్రస్తావిస్తూ ‘‘పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ 'చంద్రముఖి 2' వంటి ఓ గొప్ప సినిమాను లార్జర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. ఆయన బ్యానర్‌లో సినిమా చేయటం ఎంతో గర్వంగా ఉంది. ఇక మా డైరెక్టర్ వాసుగారి గురించి చెప్పాలంటే ఆయనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ‘చంద్రముఖి 2’ను కూడా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా సాధించే విజయం ఆయనకే దక్కుతుంది" అన్నారు.
ఇక కీరవాణిగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వర్క్‌ను టెన్షన్‌లా ఫీలై చేయరు. ఈ సినిమాతో నాకు ఆవిషయం అర్థమైంది. అలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు కాబట్టే అంత మంచి సంగీతాన్ని మా సినిమాకు అందించారు. సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిగారు, ఎడిటర్ ఆంటోని సహా ఎంటైర్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేశాం. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’’ అన్నారు.
డైరెక్టర్ పి.వాసు మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గా ఇప్పటి దర్శకులతో పోటీ పడాలనే ఆలోచిస్తుంటాను. ఆ కోణంలో ఆలోచించే 'చంద్రముఖి 2'ను రూపొందించాను. సుభాస్కరన్‌గారు తమిళ చిత్ర సీమకు దొరికిన గొప్ప నిధి. ఓ టెక్నీషియన్‌గా నా జర్నీ ప్రారంభమై నాలుగు దశాబ్దాలు అయిన విషయం మీరు చెప్పేంత వరకు నాకు తెలియలేదు. దర్శకుడిగా నేను చేసిన ప్రయాణంలో నాకు తమ సపోర్ట్ అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు, నటుడిగా నన్ను ఆదరించిన వారికి ధన్యవాదాలు. చంద్రముఖి 2ని లారెన్స్‌తో చేస్తున్నామని రజినీకాంత్‌గారికి చెప్పగానే సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆయన అన్నారు.