అల్లు అర్జున్ ను అభినందించి స్వీట్ తినిపించిన చిరంజీవి
- పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు
- జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
- అల్లు అర్జున్ ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప తన స్టామినా చాటింది. అల్లు అర్జున్ నటనకు యావత్ భారతం జేజేలు పలకగా, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు అల్లు అర్జున్ కు పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కడంతో తెలుగు చిత్రసీమ పులకించింది. మెగా, అల్లు కుటుంబ సభ్యుల ఆనందం అంతాఇంతా కాదు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి... అల్లు అర్జున్ ను స్వయంగా అభినందించారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. బన్నీకి మురిపెంగా స్వీట్ తినిపించి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరు పక్కన ఆయన అర్ధాంగి సురేఖ కూడా ఉన్నారు.