ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే ప్రకారం టీడీపీకి 15 ఎంపీ స్థానాలు: చంద్రబాబు
- పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు... అదే వైసీపీ పతనం అని వెల్లడి
- వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడని, అదే వైసీపీ పతనం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పార్లమెంటు ఎన్నికల్లోనూ టీడీపీ సత్తా చాటడం తథ్యమని, ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే ప్రకారం టీడీపీకి 15 ఎంపీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రజలతో మమేకమై వైసీపీ ఆగడాలు ఆరికడతామని అన్నారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్లు తమవైపే ఉన్నారని పేర్కొన్నారు.