తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన
- మారిన వాతావరణం
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన పరిస్థితులు
- తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణలో సెప్టెంబరు 1 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని ఐఎండీ వివరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయని, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ మేరకు పెద్దపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగనుందని తెలిపింది.
ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది.