గోషామహల్ నుంచి పోటీ అంటూ వార్తలు.. స్పష్టత నిచ్చిన రాహుల్ సిప్లిగంజ్

  • తాను రాజకీయాల్లోకి రావడం లేదన్న రాహుల్ సిప్లిగంజ్
  • గోషామహల్ నుంచి పోటీ అంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని వెల్లడి
  • ఈ పుకార్లు మరీ టూమచ్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్
తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ సింగర్, బిగ్‌బాస్‌ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌ స్పందించాడు. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టత నిచ్చాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని పేర్కొంటూ ఇన్‌స్టా, ట్విట్టర్‌‌లో పోస్టు చేశాడు.

“నేను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. అన్ని పార్టీలను, నేతలను గౌరవిస్తాను. నేను ఒక కళాకారుడిని. అందరికీ వినోదం పంచడమే నా పని. నా జీవితమంతా అందుకే అంకితం. ఈ రాజకీయ వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు” అని పేర్కొన్నాడు. 

తాను సంగీతాన్ని కెరియర్‌‌గా ఎంచుకున్నానని, ఇందులో తాను చేయాల్సింది చాలా ఉందని చెప్పాడు. తాను ఏ పార్టీని ఆశ్రయించలేదని, తనను ఏ పార్టీ కూడా కలవలేదని తెలిపాడు. దయచేసి ఈ పుకార్లను ఆపాలని కోరాడు. పుకార్లు రావడం మామూలే కానీ.. ఈ పుకారు మాత్రం మరీ టూమచ్‌గా ఉందని సెటైర్ వేశాడు.



More Telugu News