ఆకుపచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనతే: గుత్తా
- కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్న మండలి చైర్మన్
- అసెంబ్లీ ప్రాంగణంలో మొక్కలు నాటిన బీఆర్ఎస్ నేతలు
- రాష్ట్రంలో పచ్చదనం పెంచడంపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలంతా పాల్గొన్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నేతలు మొక్కలు నాటారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ తదితరులు మొక్కలు నాటారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారని వివరించారు. కేసీఆర్ దూరదృష్టికి ఈ కార్యక్రమం ఉదాహరణగా నిలుస్తోందన్నారు. హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనం పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో యావత్ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు.