దోపిడీ మీద శ్రద్ధ పెట్టి ప్రాజెక్టులను గాలికొదిలేశాడు.. సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్
- నూజివీడులో కొనసాగుతున్న యువగళం యాత్ర
- అరిసెలతో తయారు చేసిన గజమాలతో లోకేశ్ కు స్వాగతం
- టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68 వేల కోట్లు ఖర్చు చేసినట్లు లోకేశ్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు అడ్డగోలు దోపిడీ మీద ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఇందులో నాలుగో వంతు కూడా జగన్ సర్కారు ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఈమేరకు శనివారం నూజివీడులో యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శనివారం లోకేశ్, బ్రాహ్మణిల పెళ్లి రోజు కావడంతో పార్టీ శ్రేణులు, యువగళం వాలంటీర్లు లోకేశ్ తో కేక్ కట్ చేయించారు. అంతకుముందు పోతిరెడ్డిపల్లిలో యువనేతకు గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. అరిసెలతో తయారుచేసిన గజమాలతో లోకేశ్ ను తమ గ్రామంలోకి ఆహ్వానించారు. యువనేతకు తమ సమస్యలు చెప్పుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి పిట్టలవారి పాలెం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించాలని వినతిపత్రం అందించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.