‘విండోస్’ 28వ పుట్టిన రోజు.. నాటి ఆవిష్కరణ కార్యక్రమం వీడియో

  • 1995లో విండోస్ 95 విడుదల
  • 28 ఏళ్లు పూర్తి కావడంతో బిల్ గేట్స్ పోస్ట్
  • కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని ట్వీట్
కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరికీ మైక్రోసాఫ్ట్ విండోస్ సుపరిచితం. ఇది లేకపోతే అసలు కంప్యూటర్ ఎందుకూ పనికిరాదు. కంప్యూటర్ ను నడిపించే ఓ ప్రోగ్రామ్ గా విండోస్ ను మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు ప్రపంచానికి పరిచయం చేయడం, అది ఇప్పటికీ అగ్రగామిగా కొనసాగడం సాధారణ విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ లో విండోస్ వాటా 74 శాతం. ద్వితీయ స్థానంలో ఐవోఎస్ ఉంటుంది. విండోస్ తర్వాత మరిన్ని ఓఎస్ లు వచ్చినప్పటికీ.. అంతగా సక్సెస్ కాలేకపోయాయి. ప్రపంచమంతా విండోస్ కు అలవాటు పడి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండడమే దీని సక్సెస్ కు కారణం.

విండోస్ ఆవిర్భవించి 28 ఏళ్లు అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఓ ప్రత్యేక వీడియోని ‘ఎక్స్’పై షేర్ చేశారు.   విండోస్ 95 ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించినది ఇది. ‘‘కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఇతరులు 28 ఏళ్లుగా నిన్ను అనుసరిస్తున్నారు. హ్యాపీ బర్త్ డే’’ అంటూ గేట్స్ ట్వీట్ చేశారు. విండోస్ విడుదల కార్యక్రమం స్టేజీపై మైక్రోసాఫ్ట్ సీనియర్ సహచరులతో కలసి బిల్ గేట్స్ డ్యాన్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. 

నిజానికి విండోస్ మొదటి వెర్షన్ ను 1985 నవంబర్ 20న విడుదల చేశారు. కానీ అది గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్. 1995 ఆగస్ట్ 24న విండోస్ 95 విడుదలైంది. ఇది అచ్చమైన తొలి ఆపరేటింగ్ సిస్టమ్. మూడేళ్ల తర్వాత 1998లో విండోస్ 98ని తీసుకొచ్చారు.


More Telugu News