ఒక్క త్రో... రెండు ఘనతలు... నీరజ్ చోప్రా మరో సంచలనం

  • హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో వరల్డ్ చాంపియన్ షిప్
  • నేడు జావెలిన్ ను 88.77 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా
  • వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత యువకెరటం
  • అదే ఊపులో పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన వైనం
ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి సంచలన ప్రదర్శన కనబరిచాడు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ లో జావెలిన్ ను 88.77 మీటర్లు విసిరి ఫైనల్ లోకి దూసుకెళ్లడమే కాదు, ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ కు కూడా అర్హత సాధించాడు. 

వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ కు పురుషుల జావెలిన్ త్రో అర్హత మార్కు 85.50 మీటర్లు కాగా, మనవాడు 3 మీటర్లు ఎక్కువే విసిరాడు. వరల్డ్ చాంపియన్ షిప్ క్వాలిఫయింగ్ మార్కు 83 మీటర్లు కాగా, 5 మీటర్లు ఎక్కువే విసిరిన నీరజ్ చోప్రా మరో అంతర్జాతీయ టైటిల్ కు గురిపెట్టాడు. 

వరల్డ్ చాంపియన్ షిప్ లో గ్రూప్-ఏలో ఉన్న చోప్రా... క్వాలిఫయింగ్ రౌండ్ లో అగ్రస్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా ఇవాళ తొలి ప్రయత్నంలోనే సీజన్ బెస్ట్ నమోదు చేయడం విశేషం.


More Telugu News