కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న వైసీపీ ఎంపీలు

  • ఈ నెల 28న సాయంత్రం సీఈసీని కలవనున్న ఎంపీలు
  • టీడీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగిస్తున్నామన్న పెద్దిరెడ్డి
  • దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడి
కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలవనున్నారు. ఈ నెల 28న సాయంత్రం చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ను కలవబోతున్నారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు అపాయింట్ మెంట్ ఖరారయింది. ఓటర్ల జాబితాపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందనే విషయాన్ని సీఈసీ దృష్టికి ఎంపీలు తీసుకెళ్లనున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ... టీడీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగిస్తున్నామని చెప్పారు. దొంగ ఓట్లను తొలగిస్తుంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలోని దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News