తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందడి.. కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా దరఖాస్తులు!
- ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ పార్టీ
- చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు
- నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కొడుకులు అప్లై
- ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్ దరఖాస్తు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అప్లికేషన్లకు ఈ రోజు చివరి రోజు కావడంతో భారీగా ఆశావహులు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు పోటెత్తారు.
నిన్నటివరకు 700 పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈరోజు వచ్చే అప్లికేషన్లతో కలిపి వెయ్యికి చేరే అవకాశం కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో 10 నుంచి 15 దాకా అప్లికేషన్లు వచ్చాయి. మరోవైపు ఒక్కో నేత ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఓకే కుటుంబ నుంచి వేర్వేరుగా దరఖాస్తు చేస్తున్నారు.

నాగార్జున సాగర్ టికెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి దరఖాస్తు చేశారు. మిర్యాలగూడ టికెట్ కోసం రఘువీర్ రెడ్డి అప్లికేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ సోదరుడు రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేశ్ రావు దరఖాస్తు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ అప్లై చేశారు.