రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే నేను చేసినవి కాదు.. ఆనాడు జగన్ చేసినవి: నారా లోకేశ్
- తన తల్లిని అవమానించిన వాళ్లకు బుద్ధి చెపుతామంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవుతాయా? అని ప్రశ్న
- పాలకులను ప్రశ్నిస్తే నేరం అవుతుందా? అని మండిపాటు
- చంద్రబాబును కాల్చి చంపాలని, ఉరి వేయాలని గతంలో జగన్ అన్నారన్న లోకేశ్
గన్నవరం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడంతో లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం యువగళం సభలో తాను, తమ టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామంటూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
తన తల్లిని అవమానించిన వాళ్లు, మరొకరి తల్లిని అవమానించకుండా బుధ్ది చెపుతానని అనడం కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అవుతాయా? అని ప్రశ్నించారు. ప్రజాకంటక పాలకులను ప్రశ్నించే బాధ్యతను టీడీపీ తీసుకోవడం నేరం అవుతుందా? అని అడిగారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలంటే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలని అన్నారు. చంద్రబాబును కాల్చి చంపాలని, ఉరి వేయాలని, చీపుర్లతో తరమాలని, కాలర్ పట్టుకుని నిలదీయాలని జగన్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని... రెచ్చగొట్టే వ్యాఖ్యలంటే అవి అని చెప్పారు.