వాన్‌పిక్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
- గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానానికి ఈడీ
- వాన్‌పిక్ భూములకు సంబంధించి నేడు విచారణ
- తదుపరి విచారణ, ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఆదేశం
వాన్‌పిక్ కేసులో ఏపీ ప్రభుత్వానికి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం వాన్‌పిక్ భూములకు సంబంధించి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సంబంధించి గతంలో వాన్‌పిక్‌కు అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈడీ... సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ, ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలిచ్చింది.