స్టయిల్ మార్చేసిన సమంత.. ఫొటోలు ఇవిగో..

స్టయిల్ మార్చేసిన సమంత.. ఫొటోలు ఇవిగో..
  • న్యూయార్క్ వీధుల్లో తళుక్కుమన్న సమంత
  • అక్కడి నేచురల్ హిస్టరీ మ్యూజియం సందర్శన
  • వెరైటీ వస్త్రధారణ, సన్ గ్లాసెస్ పెట్టుకున్న నటి
సమంత కొంచెం కొత్తగా కనిపిస్తోంది. ఆ మధ్య మయోసైటిస్ వ్యాధితో బాధపడిన ఈ నటీమణి దాన్నుంచి కోలుకుని, సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు న్యూయార్క్ పట్టణంలో సంచరిస్తోంది. అక్కడి నేచురల్ హిస్టరీ మ్యూజియంను సందర్శించింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో ఆమె అభిమానులతో పంచుకుంది. కాకపోతే డ్రెస్ స్టయిల్ ను పూర్తిగా మార్చేసి, కొత్తగా కనిపిస్తోంది.

మ్యూజియం లోపలి కళా రూపాల వద్ద నుంచుని ఫొటోలు దిగింది. నగరంలోని రెస్టారెంట్ లో డిషెస్ ను రుచి చూసింది. న్యూయార్క్ వీధుల్లోనూ ఫొటోలను క్లిక్ మనిపించింది. ఆలీవ్ గ్రీన్ క్రాప్ టాప్, మ్యాచింగ్ పారాచ్యూట్ ప్యాంట్ ధరించి నవ్వులు చిందిస్తున్న సమంతాని ఫొట్లో చూడొచ్చు. సన్ గ్లాసెస్ కూడా ధరించింది.  సమంత ఫొటోలు అభిమానులకు నచ్చేశాయి. ‘చూడ్డానికి అద్భుతంగా ఉన్నావని’, ‘ఏమి ఆ నవ్వు’ అంటూ కామెంట్లు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో కలసి సమంత నటించిన ఖుషీ సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలోకి వస్తుండడం తెలిసిందే.  



More Telugu News