వారసులను బరిలోకి దింపి అస్త్రసన్యాసం తీసుకుంటున్న జానారెడ్డి

  • వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా కాంగ్రెస్ సీనియర్ నేత
  • 16 ఏళ్ల పాటు మంత్రిగా పని చేసిన జానారెడ్డి
  • మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నుంచి జానా కుమారుల పోటీ!
కాంగ్రెస్ అగ్రనేత, తెలంగాణ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న కుందూరు జానారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండి అస్త్రసన్యాసం తీసుకుంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16  సంవత్సరాల పాటు మంత్రిగా, ఏడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన జానారెడ్డి రానున్న ఎన్నికల్లో తాను కాకుండా ఇద్దరు కుమారులను ఎన్నికల యుద్ధ క్షేత్రంలో బరిలోకి దింపుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి ఆయన చిన్న కుమారుడు జైవీర్‌రెడ్డి పోటీలో ఉండనున్నారు. ఈ మేరకు జైవీర్‌ నిన్న పీసీసీ కార్యాలయంలో అసెంబ్లీ సీటు కోసం తన దరఖాస్తు సమర్పించారు.  రఘువీర్‌రెడ్డి ఈ రోజు దరఖాస్తు చేయనున్నారు.


More Telugu News