తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది!

  • తిరుమలలో రద్దీ సాధారణం
  • ఏడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • సర్వదర్శనానికి 15 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం
  • బుధవారం ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.76 కోట్ల ఆదాయం
గత కొన్ని రోజులుగా అధిక రద్దీ నెలకొన్న తిరుమలలో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీవారి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. గురువారం ఉదయం నాటికి స్వామివారి దర్శనానికి కేవలం 7 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం నాడు తిరుమల శ్రీవారిని 71,122 మంది దర్శించుకున్నారు. 29,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.76 కోట్ల ఆదాయం వచ్చింది.


More Telugu News