పరిశ్రమలు వెళ్లిపోవడానికి జగనే కారణం: నారా లోకేశ్

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • గన్నవరంలో రచ్చబండ కార్యక్రమం
  • వివిధ వర్గాలతో లోకేశ్ మాటామంతీ
  • నూజివీడు నియోజకవర్గంలో ప్రవేశించిన పాదయాత్ర... లోకేశ్ కు ఘనస్వాగతం 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 193వ రోజు ఘనంగా జరిగింది. అంపాపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర... కోడూరుపాడు, వీరవల్లి, రంగన్నగూడెం, సింగన్నగూడెం, మల్లవల్లి, కొత్తమల్లవల్లి మీదుగా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నేతృత్వంలో లోకేశ్ కు ఘనస్వాగతం లభించింది. అనంతరం యువగళం పాదయాత్ర మీర్జాపురం శివారు క్యాంప్ సైట్ కు చేరుకుంది. అంతకుముందు, గన్నవరంలో లోకేశ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. 

సైకో పాలనతో పరిశ్రమలు తరలిపోతున్నాయి!

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మల్లవల్లిలో 1400 ఎకరాల భూములను కొంత మంది నాయకులు కొట్టేయడానికి ప్రయత్నిస్తే మేం పోరాడాం. జగన్ విధ్వంసంతో పరిపాలన మొదలు పెట్టాడు. ప్రజావేదిక కూల్చి పరిపాలన మొదలు పెట్టాడు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో 75 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం సైకో పాలన వలన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అశోక్ లేలాండ్ లాంటి అనేక కంపెనీలు తీసుకొస్తే జగన్ ఆ కంపెనీలను తరిమేస్తున్నాడు.

ఆ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం

నిరుపేద కుటుంబాలకు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం మల్లవల్లిలో 100 ఎకరాలు కేటాయించింది. జగన్ ప్రభుత్వం వచ్చి కనీసం ఆ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లవల్లిలో పేదలకు కేటాయించిన 100 ఎకరాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. 

నారా లోకేశ్ ను కలిసిన వివిధ గ్రామాల ప్రజలు... టీడీపీ యువనేత వ్యాఖ్యలు

  • టీడీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగో వంతు ఖర్చు చేయలేదు. అధికారంలోకి వచ్చాక ఏలూరు కాలువకు పోలవరం కాలువను అనుసంధానం చేస్తాం.
  • మిషనరీలకు చెందిన వేల కోట్ల ఆస్తులను కొట్టేసేందుకు విలీనం పేరుతో డ్రామాకు తెరలేపారు. పాఠశాలల విలీనంతో జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల 4 లక్షల మంది గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. చిన్న పిల్లలు కిలోమీటర్ల మేర వెళ్లి విద్యాభ్యాసం చేయలేక చదువు మానేస్తున్నారు.
  • ముఖ్యమంత్రి జగన్ కు అడ్డగోలు దోపిడీపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై లేదు. జగన్ అనాలోచిత చర్యల కారణంగా ఏపీ రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిచింది. 
  • జగన్మోహన్ రెడ్డి చేతగాని, దివాలాకోరు పాలన గ్రామాలకు శాపంగా పరిణమించింది. గ్రామపంచాయితీలకు కేంద్రం ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.9 వేల కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి, కనీసం మంచినీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
  • జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గౌడలతోపాటు అన్ని బీసీ కులాలను నిర్లక్ష్యం చేశారు. బీసీలకు చెందాల్సిన రూ.75,790 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన బీసీ ద్రోహి జగన్. 
  • ఆయిల్ పామ్ రైతులే గాక అన్నిరకాల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దేశం మొత్తమ్మీద ఏపీ రైతులు అప్పుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయిల్ పామ్ రైతులకు గతంలో ఇచ్చిన సబ్సిడీలన్నీ పునరుద్ధరిస్తాం. రాష్ట్ర కాంపోనెంట్ ను సకాలంలో అందించి, కేంద్రం కాంపోనెంట్ ను రైతులకు అందించేలా చర్యలు చేపడతాం. ఆయిల్ పామ్ గిట్టుబాటు ధరపై కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం.
  • చిన్ననీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్న నీటి వనరుల అభివృద్ధికి రూ.18,250 కోట్లు ఖర్చుచేశాం.

పట్టిసీమ కాలువ వద్ద లోకేశ్ సెల్ఫీ చాలెంజ్

దేశ చరిత్రలో తొలిసారిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన అపర భగరీథుడు చంద్రన్న. ఇది గన్నవరం నియోజకవర్గం రంగన్న గూడెం వద్ద గల పట్టిసీమ కాలువ. 

కృష్ణా డెల్టాలో రైతుల కష్టాలు తీర్చేందుకు కేవలం 11 నెలల వ్యధిలో రూ.1360 కోట్ల వ్యయంతో 2016లో ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు. రికార్డు సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా కూడా పట్టిసీమ లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. 

పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాలోని రైతులకు ఖరీఫ్ సీజన్లో పుష్కలంగా సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టగా, ఈ ప్రాజెక్టు ఫలితాలను 2016-19 నడుమ మూడు సీజన్లలో రైతులు కళ్లారా చూశారు. విధ్వంసక పాలకుడు జగన్ నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టును పట్టించుకోకుండా తాజాగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నాడు. 

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2575.8 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 22.3 కి.మీ.*

*194వరోజు (25-8-2023) యువగళం వివరాలు*

*నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి కృష్ణాజిల్లా)*

ఉదయం

8.00 – మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 – గొల్లపల్లిలో స్థానికులతో సమావేశం.

10.00 – మొరసపూడిలో ముస్లిం సామాజికవర్గీయులతో భేటీ.

మధ్యాహ్నం

12.00 – తుక్కులూరులో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

12.45 – నూజివీడు శివార్లలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – నూజివీడు శివారు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.45 – నూజివీడు మార్కెట్ యార్డు వద్ద మామిడిరైతులతో ముఖాముఖి.

5.30 – చిన్నగాంధీబొమ్మ వద్ద స్థానికులతో సమావేశం.

5.40 – పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులతో సమావేశం.

5.55 – పెద్ద గాంధీబొమ్మ వద్ద హమాలీ వర్కర్లతో సమావేశం.

6.25 – ఎంప్లాయీస్ కాలనీలో స్థానికులతో మాటామంతీ.

8.25 – పోతిరెడ్డిపల్లి విడిది కేంద్రంలో బస.

******


More Telugu News