అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు... చంద్రబాబు స్పందన

  • 69వ జాతీయ అవార్డుల ప్రకటన
  • చరిత్ర సృష్టించిన బన్నీ
  • ఈ అవార్డుకు ఎంపికైన తొలి టాలీవుడ్ నటుడు బన్నీనే!
జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికైన టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయకుడు అల్లు  అర్జున్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో అనేక పురస్కారాలను సాధించి తెలుగు చలన చిత్ర రంగానికి విశిష్ట గుర్తింపు తెచ్చిన విజేతలందరికీ శుభాభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. 

"ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు. అలాగే, వివిధ విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్, ఉప్పెన, కొండపొలం చిత్రాల దర్శక నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, ఉత్తమ విమర్శకుడిగా ఎంపికైన పురుషోత్తమాచార్యులకు అభినందనలు" అంటూ చంద్రబాబు తన సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


More Telugu News