చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై దిగుతున్న వీడియో... ఇదిగో చూడండి!
- చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందు వీడియో
- 2 నిమిషాల 17 సెకన్ల వీడియోను పోస్ట్ చేసిన ఇస్రో
- జాబిల్లిపై దిగడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ తీసిన వీడియో ఎలా ఉందో చూడండంటూ ట్వీట్
జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెడుతున్న సమయంలో తీసిన వీడియోను ఇస్రో తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేసింది. బుధవారం సాయంత్రం గం.6.04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇస్రో పంపించిన చంద్రయాన్-3లో ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. ఈ సమయంలో తీసిన వీడియోను ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3 చంద్రుడిపై దిగుతుండగా రికార్డ్ అయిన వీడియో ఇది.
చంద్రుడిపై ల్యాండర్ దిగడానికి కొన్ని కిలోమీటర్ల ముందు మొదలైన వీడియో, దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టేవరకు ఉంది. జాబిల్లిపై దిగడానికి ముందు ల్యాండర్ ఇమేజర్ తీసిన వీడియో ఎలా ఉందో చూడండి అంటూ ఇస్రో పేర్కొంది. ఈ వీడియో 2 నిమిషాల 17 సెకన్లు ఉంది.