గంభీర్ మీరంటే గౌరవం ఉంది.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం: మాజీ సెలక్టర్
- టీమిండియా జట్టులో మార్పులు అవసరమని అభిప్రాయపడిన గౌతమ్ గంభీర్
- శివమ్ దుబేను పరిగణనలోకి తీసుకోవాల్సిందన్న మాజీ క్రికెటర్
- మార్పులు అవసరం లేదన్న మాజీ సెలక్టర్ సునీల్ జోషి
ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది. ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యాను, బ్యాకప్‌గా శార్దుల్ ఠాకూర్‌ను, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేశారు. అయితే శార్దూల్ ఠాకూర్ కంటే ఆల్ రౌండర్ బ్యాకప్‌గా శివమ్ దుబే బాగుండేదని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ సెలక్టర్ సునీల్ జోషి స్పందించారు.
శివమ్ దుబే ఫామ్‌ను పరిగణించాల్సిందని, హార్దిక్ పాండ్యాకు బ్యాకప్ అవసరమని, కానీ శార్దూల్ ఆ స్థానాన్ని భర్తీ చేయలేరని గంభీర్ అభిప్రాయపడ్డారు. పాండ్యాకు బ్యాకప్‌గా ఫామ్‌లో ఉన్న శివమ్‌ను తీసుకోవాల్సిందన్నారు. అలాగే మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ లేదా రవి బిష్ణోయ్‌లో ఒకరిని తీసుకోవాల్సిందన్నారు. నలుగురు పేసర్లకు బదులు, కనీసం ఒక లెగ్ స్పిన్నర్‌కు అవకాశం కల్పిస్తే బాగుండేదన్నారు. షమీకి విశ్రాంతి ఇచ్చి స్పిన్నర్‌ని తీసుకునే వెసులుబాటు ఉందన్నారు.
గంభీర్ వ్యాఖ్యలపై సునీల్ జోషి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టులో మార్పులు అవసరం లేదని, శివమ్ దుబే ప్రదర్శన చూశామని, ట్వంటీ20లో బాగా ఆడుతున్నప్పటికీ, వన్డే పార్మాట్‌లో రాణించలేకపోతున్నాడన్నారు. బౌలింగ్ లోను గొప్ప ప్రదర్శన ఏమీ లేదని, ఫీల్డింగ్‌లో కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా ఉందన్నారు. కానీ శార్దూల్ బాగా రాణించారన్నారు. అయినప్పటికీ గంభీర్ పట్ల తనకు గౌరవం ఉందని, ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు.