గవర్నర్ తమిళిసైని కలిసిన సీఎం కేసీఆర్... 20 నిమిషాల పాటు భేటీ
- ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం
- రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్
- తమిళిసైతో పలు అంశాలపై చర్చ
- గత కొంతకాలంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలు!
గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఏమాత్రం సఖ్యత లేదన్న విషయం తెలుస్తుంది. బాహాటంగా విమర్శలు గుప్పించుకునే స్థాయికి ఈ విభేదాలు ముదిరాయి. ఈ నేపథ్యంలో, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది.
సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లడమే కాదు, అక్కడ గవర్నర్ తమిళిసైని కలవడం అత్యంత చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ తో సీఎం కేసీఆర్ సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు సాగినట్టు తెలుస్తోంది.
ఆయన రాజ్ భవన్ కు వెళ్లడానికి కారణం ఉంది. ఇవాళ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వచ్చారు. ఈ సందర్భంగానే గవర్నర్ తమిళిసైని కలిసి పలు అంశాలపై చర్చించారు. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.