ఇదేం తీరు!: మంత్రి విడదల రజినిపై విజయసాయిరెడ్డి అసహనం?

  • మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీతో వేర్వేరుగా విజయసాయి సమీక్ష
  • గ్రూప్ రాజకీయాలతో పార్టీకి నష్టం చేస్తున్నారని మంత్రిపై ఆగ్రహం
  • స్థానిక నేతల నుండి వైసీపీ ఎంపీకి ఫీడ్ బ్యాక్!
మంత్రి విడదల రజినిపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల పనితీరుపై నరసరావుపేటలో సమీక్ష నిర్వహించారు. మంత్రి విడదల రజని, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విడదల రజిని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంపై చర్చ సాగిందని తెలుస్తోంది. ఇక్కడ ఎమ్మెల్సీ రాజశేఖర్, జాన్ సైదా వర్గాలను వేరుచేసి పార్టీకి నష్టం చేస్తున్నారని మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

గ్రూప్ రాజకీయాల కారణంగా పార్టీ బలహీనపడుతోందని, ఇది సరైన పద్ధతి కాదని క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతోను విభేదాలు కనిపిస్తున్నాయని చెప్పారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఐప్యాక్ ఇచ్చిన నివేదికను ఆమె ముందు పెట్టినట్లుగా సమాచారం. స్థానిక నేతల నుండి కూడా విజయసాయి ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది.


More Telugu News