ఇండియా చరిత్రను సృష్టిస్తూనే ఉంది: దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్
- చంద్రయాన్-3 విజయంపై షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రశంసలు
- పట్టుదలతోనే దేశాలు అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్య
- మోదీకి అభినందనలు తెలిపిన నేపాల్ ప్రధాని ప్రచండ
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అభినందనలు తెలిపారు. చంద్రుడిపై విజయవంతంగా దిగినందుకు భారత్ లోని తమ మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. పట్టుదలతోనే దేశాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారత్ చరిత్రను సృష్టిస్తూనే ఉందని కితాబునిచ్చారు. నేపాల్ ప్రధాని ప్రచండ కూడా భారత ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చారిత్రక విజయాన్ని సాధించినందుకు ప్రధాని మోదీని, ఇస్రో బృందాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. ఇస్రో విజయం యావత్ మానవాళికి దక్కిన విజయమని మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ అభినందించారు. కంగ్రాట్స్ ఇండియా అంటూ ట్వీట్ చేశారు.