క్లారిటీ వచ్చేసింది.. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..!

  • త్వరలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు
  • కొడంగల్ నుంచి పోటీ చేయబోతున్న రేవంత్ రెడ్డి
  • తన తరపున స్థానిక కార్యకర్తలు దరఖాస్తు చేస్తారన్న రేవంత్
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారో క్లారిటీ వచ్చింది. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ నుంచే పోటీ చేయబోతున్నట్టు రేవంత్ స్పష్టం చేశారు. కొడంగల్ నుంచి పోటీ చేయడానికి ఈరోజు ఆయన పార్టీకి దరఖాస్తు చేయనున్నారు. తన తరపున కొడంగల్ లోని స్థానిక నేతలు దరఖాస్తు చేస్తారని చెప్పారు.

 పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కొడంగల్ కార్యకర్తల ద్వారా దరఖాస్తు ఇవ్వబోతున్నామని తెలిపారు. సోనియా ఆదేశాల మేరకు ఇది జరుగుతోందని చెప్పారు. కొడంగల్ అభివృద్ధే లక్ష్యంగా అక్కడి నుంచి పోటీ చేయాలని సోనియా చెప్పారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే టీపీసీసీ చీఫ్ అయినా, సామాన్య కార్యకర్త అయినా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాను ఈరోజు దరఖాస్తు చేయబోతున్నట్టు చెప్పారు. 



More Telugu News