దేశ సినీ చరిత్రలోనే అతి పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసుకున్న మోహన్ లాల్ 'వృషభ' మూవీ

  • పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న మోహన్ లాల్ 'వృషభ'
  • ఐదు భాషల్లో విడుదల కానున్న చిత్రం
  • కీలక పాత్రల్లో రోషన్, శనయ కపూర్
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కు పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ఉంది. బహు భాషా నటుడిగా ఆయన పేరుగాంచారు. ప్రస్తుతం మోహన్ లాల్ 'వృషభ' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగు, మలయాళ, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ను మేకర్స్ అందించారు. 

నెల రోజుల పాటు కొనసాగిన భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది అతి పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పారు. షూటింగ్ లొకేషన్ లో మోహన్ లాల్, రోషన్, శనయ కపూర్ తదితరులు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, సిమ్రన్, గరుడ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏక్తా కపూర్, వరుణ్ మాథుర్, అభిషేక్ వ్యాస్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.


More Telugu News