రాజబాబును ఆర్ధికంగా దెబ్బతీసిన సినిమా అదేనంటున్న కాకరాల!
- అనేక సినిమాలు చేసిన కాకరాల
- రాజబాబుతో తన స్నేహం గురించిన ప్రస్తావన
- ఆయనది చాలా జాలిగుండె అంటూ వ్యాఖ్య
- అందువల్లనే చివరి రోజుల్లో బాధలు పడ్డాడని వెల్లడి
తెలుగు తెరను ఏలిన హాస్య నటులలో రాజబాబు ఒకరు. అప్పట్లో చాలామంది హాస్యనటులు ఉన్నప్పటికీ, కామెడీపై తనదైన ముద్రవేసి పరుగులు తీయించిన వారాయన. అలాంటి రాజబాబు గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ నటుడు కాకరాల ప్రస్తావించారు. "రాజబాబు నా కంటే ఒక ఏడాది పెద్ద .. అయినా నన్ను అన్నయ్య అనే పిలిచేవాడు. మా ఇద్దరి అనుబంధం వేరు .. అది చివరి వరకూ కొనసాగింది" అని అన్నారు.
"రాజబాబు జాలి గుండె కలిగినవాడు. తన ఎదురుగా ఉన్నవారు బాధపడుతూ ఉంటే తాను చూడలేడు. ఎవరినైనా చాలా ఎక్కువగా అభిమానించేవాడు .. ప్రేమించేవాడు. ఆ నమ్మకాన్ని వాళ్లు నిలబెట్టుకోలేకపోయినప్పుడు అంతగానూ బాధపడేవాడు. చాలా సందర్భాల్లో అలా జరుగుతూనే వచ్చింది. నటుడిగా ఉన్న సమయంలోనే తను నిర్మాతగాని మారాడు" అని చెప్పారు.
'మనిషి రోడ్డున పడ్డాడు' అనే సినిమాను సొంత బ్యానర్లో తీయాలనుకుంటున్నానని రాజబాబు నాకు చెప్పాడు. టైటిల్ నెగెటివ్ గా ఉంది .. అంటూ నేను నా అసంతృప్తిని వ్యక్తం చేశాను. అయినా వినిపించుకోకుండా ఆ సినిమాను నిర్మించాడు. ఆ సినిమా వలన వచ్చిన ఆర్థికపరమైన ఇబ్బందులను తట్టుకోలేక రోడ్డుపైనే పడిపోయి ఏడ్చాడు. ఆయన సుఖాల్లోనే కాదు .. కష్టాల్లోను తాను వెంటే ఉన్నా'నని కాకరాల చెప్పుకొచ్చారు.