లక్ష్యం నెరవేరింది: రామ్ చరణ్

  • చంద్రయాన్-3 సక్సెస్ పై ఆనందాన్ని వ్యక్తం చేసిన రామ్ చరణ్ 
  • చంద్రుడిని చంద్రయాన్ స్పృశించడం గొప్ప విజయమని వ్యాఖ్య
  • ఇస్రో మనల్ని విశ్వానికి మరింత చేరువ చేసిందని కితాబు
అంతరిక్ష పరిశోధన రంగంలో మన దేశ ఖ్యాతి మరింత ఇనుమడించింది. చంద్రయాన్-3 సక్సెస్ తో అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా నిలబడింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మన ప్రగ్యాన్ రోవర్ పంపే చంద్రుడి డేటా కోసం ప్రపంచ దేశాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. 

మరోవైపు చంద్రుడిని ముద్దాడాలనుకున్న కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేసిన ఇస్రోకు సినీ నటుడు రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు. 'లక్ష్యం నెరవేరింది. చంద్రుడిని చంద్రయాన్ స్పృశించడం భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి ఒక గొప్ప విజయం. ఇస్రో అసాధారణమైన పని తీరుకు, మనల్ని విశ్వానికి మరింత చేరువ చేసినందుకు వారికి ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు. 



More Telugu News