'కారవాన్' అడిగితే ఆ హీరోయిన్ నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది: 'బేబి' హీరోయిన్
- 'బేబి' సినిమాతో హిట్ కొట్టిన వైష్ణవి
- పదో తరగతి నుంచే బాధ్యతలు మోశానని వివరణ
- బర్త్ డే పార్టీల్లో డాన్సులు చేశానని వెల్లడి
- అవమానాలు ఎదురైనప్పుడు తన తల్లి బాధపడిందని వ్యాఖ్య
వెండితెరపై హీరోయిన్ గా కనిపించాలనీ .. స్టార్ హీరోయిన్ గా ఎదగాలని చాలామంది అనుకుంటారు. కొంతమంది మొదటి సినిమాతోనే హిట్ కొట్టేస్తే, మరికొంతమంది ఏళ్లపాటు ఎదురుచూస్తూనే ఉంటారు. అలా హీరోయిన్ గా తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నవారి జాబితాలో వైష్ణవీ చైతన్య కూడా కనిపిస్తుంది. 'బేబి' సినిమాతో ఆమె ఇప్పుడు స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది.
వైష్ణవి హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా ఇదే అయినా, ఆమె ఈ ఫీల్డ్ లో ఇంతకుముందు నుంచే ఉంది. సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూనే, యూ ట్యూబ్ స్టార్ గా ఎదుగుతూ వెళ్లింది. యూత్ కి చేరువవుతూనే వచ్చింది. ఈ క్రమంలో తాను ఎన్నో కష్టాలు పడినట్టుగా తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.
"పదో తరగతిలోనే నాపై కుటుంబ బాధ్యత పడింది. ఇల్లు గడవడం కోసం పెళ్లిళ్లలో .. బర్త్ డే ఫంక్షన్స్ లో డాన్సులు చేశాను. అలా వెళ్లినప్పుడల్లా 700 వచ్చేవి. సాధారణంగా షూటింగు సమయాల్లో చిన్న ఆర్టిస్టులకు 'కారవాన్' ఇవ్వరు. అలాంటి సందర్భాల్లో నేను బాత్ రూమ్ లోనే బట్టలు మార్చుకున్నాను. ఒకసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక హీరోయిన్ ను 'కారవాన్' అడిగాను. దాంతో ఆమె నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. అది తెలిసి, మనకి ఈ ఫీల్డ్ వద్దని అమ్మ బాధపడింది" అంటూ చెప్పుకొచ్చింది.