ఇంకా ఎంత మంది తాళిబొట్లు తెంచుతావ్ జగన్?: నారా లోకేశ్

  • గన్నవరం చినఅవుటపల్లి ఎస్.ఎమ్.కన్వెన్షన్ నుంచి 192వ రోజు పాదయాత్ర ప్రారంభం
  • అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు, తమ సమస్యలు చెప్పుకున్న వైనం
  • జె-బ్రాండ్ల మద్యంతో రాష్ట్రంలోని లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడని జగన్‌పై మండిపడ్డ లోకేశ్
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు చక్కదిద్దుతామని హామీ
  • యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం ఇంచార్జ్‌గా ప్రకటించిన లోకేశ్
యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తుతోంది. 192వరోజు యువగళం పాదయాత్ర చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా యువనేత నారా లోకేశ్‌కు జనం అడుగడుగునా బ్రహ్మరథంపట్టారు. కన్వెన్షన్ హాలు నుంచి ప్రారంభమైన యాత్ర.. చినఅవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు మీదుగా అంపాపురం శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. 

గన్నవరం ఇంఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటిస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. పిల్లసైకో వంశీని, సన్నబియ్యం సన్నాసి వంశీని ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని యువనేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లి ఎస్.ఎమ్.కన్వెన్షన్ హాలులో పలువురు వైసీపీ నేతలు, వారి అనుచరులతో కలిసి యువనేత లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ...వంశీని గెలిపించడానికి కృషి చేసిన టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టి వేధించారు, అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ హెచ్చరించారు. ఇప్పుడు తమపై తప్పుడు ఆరోపణలు చేసే వంశీ ఆనాడు ఎందుకు బి.ఫామ్ తీసుకున్నాడని సూటిగా ప్రశ్నించారు. ‘‘పిల్ల సైకో వంశీని శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పించాలి. పిల్లసైకో వంశీ వైసీపీలోకి వెళ్లిన తర్వాత ధైర్యంగా బచ్చుల అర్జునుడు ముందుకు వచ్చారు. అంచలంచెలుగా అర్జునుడు పార్టీలో ఎదిగారు. బచ్చుల అర్జునుడు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం’’ అని హామీ ఇచ్చారు.  

 ‘‘మాటతప్పుడు, మడమతిప్పుడుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. ఇది గన్నవరం నియోజకవర్గం చినఅవుటపల్లిలో జగన్ సర్కారు ఏర్పాటు చేసిన లిక్కర్ వాకిన్ స్టోర్. ఎన్నికల సమయంలో మద్యనిషేధం చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకపోగా... రకరకాల పేర్లతో వీధికొక మద్యం దుకాణాన్ని ఏర్పాటుచేసి మందుబాబులను మత్తులో ముంచుతున్నాడు. జె-బ్రాండ్ల మద్యంతో రాష్ట్రంలోని లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతూ తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకుంటున్నాడు. మద్యనిషేధం చేశాకే మళ్లీ ఓట్లడుగుతానని చెప్పిన నువ్వు ఏ మొఖం పెట్టుకొని జనం వద్దకు వెళతావ్. ఇంకెంతమంది తాళిబొట్లు తెంచుతావ్ జగన్మోహన్ రెడ్డీ? అని మండిపడ్డారు. 

భువనేశ్వరమ్మకు కానుకగా ఇస్తాం: యార్లగడ్డ
కలసికట్టుగా పని చేసి గన్నవరంలో వంశీని ఓడిస్తామని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ‘‘గన్నవరాన్ని భువనేశ్వరమ్మకు కానుకగా ఇస్తాం. నేను పెత్తనం చేయడానికి పార్టీలోకి రాలేదు, గన్నవరంలో టీడీపీ జెండా ఎగరేయడానికి వచ్చా. టీడీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేస్తా’’ అని అన్నారు. 

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు వద్ద ఏపీ భవన నిర్మాణదారులు, కార్మిక సమాఖ్య ప్రతినిధులు యువనేత లోకేశ్‌తో సమావేశమై తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని నారా లోకేశ్ భరోసా కల్పించారు. ‘‘జగన్మోహన్ రెడ్డి ధనదాహం 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది. గత 51నెలల్లో ఇసుకపై జగన్ అండ్ కో రూ.10వేల కోట్లరూపాయలకు పైగా దోచుకున్నారు. జగనాసురుడి ఇసుక దాహం కారణంగా అన్నప్రాజెక్టు కొట్టుకుపోయి 61మంది అమాయకులు బలయ్యారు. పనులు కోల్పోయి రాష్ట్రంలో వందలాది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. భవననిర్మాణ కార్మికుల సంక్షేమనిధి సొమ్ము రూ.2వేల కోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించింది. టీడీపీ అధికారంలో రాగానే మెరుగైన ఇసుక పాలసీ ద్వారా నిర్మాణరంగాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తాం’’ అని హామీ ఇచ్చారు. 

 ఆత్కూరు కోఆపరేవటివ్ బ్యాంకు బాధితులు యువనేత నారా లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2022 మే నెలలో ఆత్కూరు కోఆపరేవటివ్ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు రూ.3కోట్లు గోల్ మాల్ చేశారని ఆరోపించారు. నష్టపోయిన బాధితుల్లో నలుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాపోయారు. నారా లోకేశ్ స్పందిస్తూ..‘‘అధికారంలోకి వచ్చాక ఆత్కూరు కోఆపరేవటివ్ సొసైటీలో డబ్బుకొట్టేసిన దొంగలను జైలుకు పంపి, దోపిడీసొమ్ము రాబట్టి బాధితులకు న్యాయం చేస్తాం. ఆత్కూరు గ్రామంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తాం’’ అని భరోసా ఇచ్చారు. 

పొట్టిపాడులో నారయ్య అప్పారావుపేట గ్రామస్తులు యువనేత లోకేశ్‌ను కలిసి తమ గ్రామంలో అభివృద్ధి నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన నారా లోకేశ్.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.9వేలకోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రామసీమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలికసదుపాయాలు కల్పిస్తామన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి, 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 

యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వివరాలు
  • ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2553.5 కి.మీ.
  • ఈరోజు నడిచిన దూరం 11.2 కి.మీ.

193వరోజు (24-8-2023) యువగళం వివరాలు
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి కృష్ణాజిల్లా)
ఉదయం
8.00 – అంపాపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 – అంపాపురంలో స్థానికులతో సమావేశం.
9.00 – కోడూరుపాడులో స్థానికులతో సమావేశం.
9.45 – వీరవల్లిలో స్థానికులతో సమావేశం.
11.00 – రంగన్నగూడెంలో స్థానికులతో సమావేశం.
11.45 – పట్టిసీమ కాలువ సందర్శన.
1.00 – సింగన్నగూడెంలో గౌడ సామాజికవర్గీయులతో భేటీ.
1.45 – మల్లవల్లిలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – మల్లవల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – మల్లవల్లిలో స్థానికులతో సమావేశం.
4.45 – మల్లవల్లి బీసీ కాలనీలో బీసీలతో సమావేశం.
6.45 – కొత్తమల్లివల్లిలో ఆయిల్ పామ్ రైతులతో భేటీ.
7.15 – పాదయాత్ర నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
7.25 – మీర్జాపురంలో స్థానికులతో మాటామంతీ.
8.25 – మీర్జాపురం శివారు విడిది కేంద్రంలో బస.




More Telugu News