మంత్రివర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి

  • కేసీఆర్ కేబినెట్లోకి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
  • ఖాళీ అయిన ఈటల రాజేందర్ స్థానంలో మహేందర్ రెడ్డికి అవకాశం
  • రేపు మధ్యాహ్నం గం.3కు మంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని తెలంగాణ కెబినెట్లోకి తీసుకోనున్నారు. ఈటల రాజేందర్ స్థానంలో ఖాళీ అయిన బెర్త్‌ను ఇప్పటి వరకు అలాగే ఉంచారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి తాండూరు నుండి పోటీ చేయాలనుకున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ ఇస్తుండటంతో ప్రత్యామ్నాయం చూసుకుంటానని పార్టీ దృష్టికి మహేందర్ రెడ్డి తీసుకు వెళ్లారని తెలుస్తోంది.

ఈ క్రమంలో పార్టీ ముఖ్యనేతలు ఆయనతో చర్చించి, బుజ్జగించారని సమాచారం. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విజయానికి సహకరించాలని వారు కోరారు. దీంతో మహేందర్ రెడ్డి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం గం.3కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.


More Telugu News