చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతం, దక్షిణ ధ్రువంపై తొలి అడుగు మనదే!

  • చంద్రుడిని ముద్దాడిన విక్రమ్ ల్యాండర్
  • దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్రపుటల్లోకి భారత్
  • చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్
చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ బుధవారం ప్రక్రియ ముగిసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటల్లోకి ఎక్కింది. చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశం భారత్. సరిగ్గా సాయంత్రం గం.6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని ముద్దాడింది. శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.

ల్యాండింగ్ ప్రక్రియ సాయంత్రం గం.5.44 నిమిషాలకు ప్రారంభమైంది. రోవర్ చంద్రుడిపై రెండు వారాలపాటు పరిశోధనలు చేయనుంది. మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులపై పరిశోధన చేయనుంది. ప్రధాని మోదీ జోహన్నెస్‌బర్గ్ నుండి వర్చువల్‌గా చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించారు.

ఇండియా, మీతో పాటు నేనూ నా గమ్యస్థానాన్ని చేరుకున్నానంటూ చంద్రయాన్-3 పేర్కొన్నట్లు ఇస్రో సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్)లో షేర్ చేసింది.


More Telugu News