అంతా బాగుందనుకున్నప్పటికీ... చైనా ఆర్థిక వ్యవస్థ ఎందుకు పతనమైంది?
- ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ రెండో ఆర్థిక వ్యవస్థ
- భారీగా పెరిగిపోయిన నిరుద్యోగం
- రియాల్టీ కష్టాలు, లోకల్ గవర్నమెంట్ డెబిట్స్, జనాభా తగ్గుదల
చైనా చాలాకాలంగా ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌లా కనిపించింది. కానీ గత కొద్దికాలంగా ఆర్థిక మందగమనంతో డ్రాగన్ దేశం పతాకశీర్షికలకు ఎక్కుతోంది. ప్రస్తుతం చైనా పరిస్థితి ప్రపంచ నాయకులను, పెట్టుబడిదారులను అప్రమత్తం చేసింది. వాస్తవానికి కొన్ని దశాబ్దాల తర్వాత ప్రపంచ రెండో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లోకి వెళ్లింది.
హాంగ్ కాంగ్ కు చెందిన హాంగ్ షెంగ్ ఇండెక్స్ శుక్రవారం భారీగా పతనమైంది. జనవరిలోని గరిష్ఠస్థాయితో 20 శాతం మేర పడిపోయింది. అలాగే, గతవారం చైనీస్ యువాన్ పదహారేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. డాలర్‌తో యువాన్ రేట్‌ను ఎక్కువగా సెట్ చేయడం ద్వారా చైనా సెంట్రల్ బ్యాంకు కరెన్సీ పతనానికి కొంతమేర అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేసింది.
కరోనా లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో కార్యకలాపాలు వేగవంతమైనప్పటికీ, ఆ తర్వాత వృద్ధి నిలిచిపోయింది. దీంతో కన్స్యూమర్ ధరలు పడిపోయాయి... రియల్ ఎస్టేట్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది... ఎగుమతులు మందగించాయి. చైనాలో నిరుద్యోగం ఎంతలా పెరిగిందంటే ప్రభుత్వం కనీసం నిరుద్యోగ డేటాను కూడా విడుదల చేయలేని విధంగా పరిస్థితి ఏర్పడింది.
దీనికి తోడు ఇక్కడి మేజర్ హోమ్ బిల్డర్, ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ తమ పెట్టుబడిదారులకు చెల్లింపులు చేయకుండా ఇబ్బందుల్లోకి వెళ్లాయి. ఈ హౌసింగ్ మార్కెట్ క్షీణత ఆర్థిక స్థిరత్వానికి మరింత ప్రమాదకరంగా మారవచ్చుననే భయాలు నెలకొన్నాయి.
దేశీయంగా డిమాండ్‌ను పెంచడానికి దృఢమైన చర్యలు లేకపోవడం, మరోసారి కరోనా భయాలు ఆర్థిక వృద్ధి భయానికి మరింత తోడయ్యాయి. వివిధ మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు చైనా ఆర్థిక వృద్ధి రేటును 5 శాతం కంటే దిగువకు అంచనా వేయడం గమనార్హం.
చైనా జీడీపీ అంచనాలను తగ్గిస్తున్నామని యూబీఎస్ విశ్లేషకులు ఓ రీసెర్చ్ నోట్‌లో వెల్లడించారు. నోమురా, మోర్గాన్ స్టాన్లీ, బార్క్‌లేస్ వంటి దిగ్గజాలు కూడా గతంలో కంటే ఇప్పుడు అంచనాలను తగ్గించాయి.
అంటే చైనా తన 5.5 శాతం లక్ష్యాన్ని అందుకోలేకపోవచ్చునని, ఇది జిన్ పింగ్ నాయకత్వంలోని చైనాకు తీవ్ర ఇబ్బందికర పరిణామమని చెబుతున్నారు. 2008లో ప్రపంచ సంక్షోభం సమయంలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. అయితే కరోనా సమయానికి కూడా చైనా ఆర్థిక పరిస్థితి బాగానే కనిపించింది. కానీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. మరి ఎక్కడ సమస్య వచ్చింది? అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది.
రియాల్టీ కష్టాలు
చైనా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్ నుండి మందగమనంలోకి వెళ్లింది. అంతకుముందు కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ వృద్ధి మందగించింది. చైనా అతిపెద్ద డెవలపర్ అయిన కంట్రీ గార్డెన్, మరో అతిపెద్ద కంపెనీ జోంగ్ రాంగ్ ట్రస్ట్ డిఫాల్ట్‌గా మారాయి. ఈ ప్రభావం భారీగా పడింది. దీంతో ఏప్రిల్ నుండి చైనా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
కంట్రీ గార్డెన్ రెండు యూఎస్ డాలర్ బాండ్స్ చెల్లింపులను చేయలేదు. 2021లోనే ఎవర్ గ్రాండ్ ద్వారా రియాల్టీ రంగంలో సంక్షోభ సంకేతాలు వచ్చాయి. ఈ సంస్థ ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో కంట్రీ గార్డెన్ సంక్షోభంతో చైనా ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
రియల్ ఎస్టేట్ పునరుద్ధరణకు బీజింగ్ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ, అప్పటికే ఈ రంగంలోని దిగ్గజాలు డిఫాల్ట్ అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. రియాల్టీ రంగంలో మరింత నష్టాలు విస్తృత ఆర్థిక అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని క్యాపిటల్ ఎకనమిక్స్ చైనా హెడ్ జూలియన్ ఎవాన్స్ ప్రిచార్డ్ అన్నారు. డొమెస్టిక్ ఫండ్స్ ఎక్కువగా ప్రభుత్వ బాండ్లు, బ్యాంకు డిపాజిట్ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మరలుతుండటంతో నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
లోకల్ గవర్నమెంట్ డెబిట్స్
చైనా ఆర్థిక సంక్షోభానికి మరో ప్రధాన కారణం లోకల్ గవర్నమెంట్ డెబిట్స్. రియాల్టీ మాంద్యం కారణంగా స్థానిక ప్రభుత్వాలకు రాబడి తగ్గింది. అదే సమయంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో ఖర్చులు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ ఊతానికి బీజింగ్ వడ్డీ రేట్ల తగ్గింపు సహా వివిధ ప్రణాళికలతో ముందుకు సాగింది. అయితే 15 ఏళ్ల క్రితం మాదిరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చే ప్రయత్నాలు చేసిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఊతానికి 4 ట్రిలియన్ యువాన్ల ఆర్థిక ప్యాకేజీని విడుదల చేశారు. కానీ స్థానిక ప్రభుత్వాల రుణ పెరుగుదల వంటి వివిధ అంశాలు సంక్షోభం కొనసాగడానికి కారణంగా మారుతున్నాయి.
జనాభా క్షీణత
చైనా చాలాకాలంగా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు అమెరికా, యూరోప్ దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇక్కడ సంతానోత్పత్తి రేటు భారీగా పడిపోయింది. గత సంవత్సరం 1.30 ఉండగా, 1.09కి పడిపోయింది. చైనా సంతానోత్పత్తి రేటు ఇప్పుడు జపాన్ కంటే తక్కువగా ఉంది. గత ఆరు దశాబ్దాలతో చైనా జనాభా మొదటిసారి తగ్గుతున్నట్లుగా ఇటీవలి నివేదిక తెలిపింది. చైనాలోని వృద్ధాప్య సమాజం ఆర్థిక వృద్ధి సామర్థ్యానికి పెను సవాలుగా మారిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. వృద్ధులు పెరగడంతో కార్మికులు తగ్గడం, ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చులు పెరగడం వంటి వివిధ ఇబ్బందులు తలెత్తాయి.