ఈ బ్యాంకుల్లో అతి తక్కువ రేటుకే పర్సనల్ లోన్ 

  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అతి తక్కువ రేటు 
  • 10 శాతం రేటుకే ఆఫర్
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్ సీ ఫస్ట్ లోనూ తక్కువే
వ్యక్తిగత రుణాలను (పర్సనల్ లోన్) నేడు ఎక్కువ మంది తీసుకుంటున్నారు. సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తుండడంతో, ఇందులో పనిచేసే అందరికీ బ్యాంకు రుణాల అర్హత లభిస్తోంది. ఎన్నో అవసరాల కోసం పర్సనల్ లోన్ ను ఆశ్రయిస్తుంటారు. పర్సనల్ లోన్ తో క్రెడిట్ కార్డు బకాయిల చెల్లింపునకు ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ బకాయిలపై వడ్డీ రేటు 36-42 శాతం వరకు పడుతుంది. అదే పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు 12 శాతం స్థాయిలోనే ఉంటోంది. అందుకని తక్కువ వడ్డీ రేటుకు వచ్చే పర్సనల్ లోన్ తీసుకుని క్రెడిట్ కార్డ్ భారాన్ని తగ్గించుకుంటున్నారు.

ఇదొక్కటే అని కాకుండా, అత్యవసరాలు ఏర్పడినప్పుడు, హాస్పిటల్ లో చేరాల్సి వచ్చినప్పుడు, పిల్లల విద్య కోసం ఎంతో మంది వ్యక్తిగత రుణాలను తీసుకుంటూ ఉంటారు. వీటిపై వడ్డీ రేటు అన్ని బ్యాంకుల్లో ఒకే మాదిరిగా ఉండదు. కనుక తక్కువ రేటు ఉన్న బ్యాంక్ నుంచి తీసుకోవడం వల్ల ఎంతో కొంత ఆదా చేసుకోవచ్చు. పర్సనల్ లోన్ పై తక్కువ వడ్డీ రేటు ఏ బ్యాంకుల్లో ఉందో ఇక్కడ చూడొచ్చు.

వివిధ బ్యాంకుల్లో రేట్లు  
బ్యాంక్ 
రుణం మొత్తం (రూ.లలో) 
కాల వ్యవధి 
ఇంటరెస్ట్ రేటు (శాతంలో) 
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 20 లక్షల వరకు 
84 నెలల వరకు 
10 
బ్యాంక్ ఆఫ్ ఇండియా 
20 లక్షల వరకు 84 నెలలు 
10.25 
ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ 
కోటి వరకు 
6-60 నెలలు 
10.49 
కోటక్ మహీంద్రా బ్యాంక్ 
25 లక్షల వరకు 
12-60 నెలలు 10.99 
ఫెడరల్ బ్యాంక్ 
25 లక్షల వరకు 48 నెలలు 
11.49 
బంధన్ బ్యాంక్ 
25 లక్షల వరకు 
 60 నెలలు 11.55 
కర్ణాటక బ్యాంక్ 
5 లక్షల వరకు 60 నెలల వరకు 14.12 
సిటీ యూనియన్ బ్యాంక్ లక్ష వరకు 36-60 నెలలు 
18.75 
   



More Telugu News