రాజ్ కోసం చక్రవర్తిగారి మాటను కూడా పక్కన పెట్టేశాను : కోటి
- రాజ్ గురించి ప్రస్తావించిన కోటి
- తనకి ఫస్టు ఛాన్స్ వచ్చిందని వివరణ
- తన కోరిక మేరకే కలిసి పనిచేశామని వ్యాఖ్య
- రాజ్ మరణాన్ని తట్టుకోలేపోయానని వెల్లడి
బాలీవుడ్ లో సంగీత దర్శకులుగా ఇద్దరు కలిసి పనిచేయడం ఎక్కువగా కనిపిస్తుంది. అదే తెలుగు విషయానికి వచ్చేసరికి రాజ్ - కోటి పేర్లు మాత్రమే ప్రధానంగా కనిపిస్తాయి. వాళ్లిద్దరూ కలిసి అనేక హిట్ సాంగ్స్ ను అందించారు. చాలామంది స్టార్ హీరోలు వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. అలాంటి రాజ్ - కోటి ఆ తరువాత కాలంలో విడిపోయారు.
తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటి మాట్లాడుతూ, "నేను .. రాజ్ ఇద్దరం కలిసి చక్రవర్తిగారి దగ్గర పనిచేసేవాళ్లం. అలాంటి పరిస్థితుల్లో రాజ్ కి ముందుగా సంగీత దర్శకుడిగా ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఆయనే అన్నాడు .. ఇద్దరం కలిసి పనిచేద్దాం అని. అయితే అందుకు చక్రవర్తిగారు ఒప్పుకోలేదు. నా ఎంట్రీ పెద్ద సినిమాతో ఉండాలని ఆయన అన్నారు.
అయితే ఈ విషయం తెలిసి రాజ్ చాలా బాధపడ్డాడు. తాను అంతగా ఫీల్ కావడం చూసి నేను మనసు మార్చుకున్నాను. చక్రవర్తిగారితో మళ్లీ మాట్లాడి .. ఆయన దగ్గరున్న అవకాశాలను వదులుకుని రాజ్ దగ్గరికి వచ్చేశాను. పదేళ్ల పాటు కలిసి పనిచేశాం. మేం విడిపోవడంలో ఎవరి తప్పూ లేదు .. అది కాలమహిమ అంతే. తను చనిపోయినప్పుడు నేను తట్టుకోలేకపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.