తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... అలిపిరి వద్ద పరిస్థితి ఎలా ఉందో చూడండి!
- వారాంతం ముగిసినా తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులు
- అలిపిరి చెక్ పాయింట్ వద్ద బారులు తీరిన వాహనాలు
- గో మందిరం వరకు ఇదే పరిస్థితి!
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు వారాంతం ముగిసినా భక్తుల తాకిడి తగ్గలేదు. సోమ, మంగళవారాల్లో సైతం భక్తులు పోటెత్తడంతో, తిరుమలలో విపరీతమైన రద్దీ నెలకొంది. అలిపిరి వద్ద చూస్తే... భక్తులు ఏ రీతిలో భారీగా తరలి వస్తున్నారో అర్థమవుతోంది.
అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఇక్కడి గో మందిరం వరకు వాహనాల వరుస కనిపిస్తోంది. ఒక్కొక్క వాహనాన్నే తనిఖీ చేసి పంపిస్తుండడంతో, భక్తులు అధిక సమయం పాటు వేచి చూడాల్సి వస్తోంది.
శ్రీవారి భక్తుల లగేజి నిర్వహణ కోసం కొత్త సాఫ్ట్ వేర్
ఇప్పటివరకు నడకదారుల్లో తిరుమల చేరుకునే భక్తుల లగేజిని తిరుపతిలో సేకరించి, తిరుమలలో అందించేవారు. ఈ విధానంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించిన టీటీడీ కొత్త సాఫ్ట్ వేర్ ను తీసుకువచ్చింది.
లగేజీ కేంద్రాల్లో భక్తుల సామాన్లు తీసుకుని టికెట్ ఇస్తారు. ఈ టికెట్ ను స్కాన్ చేస్తే వారి లగేజి ఎక్కడ ఉందో అన్ని వివరాలు తెలుస్తాయి. దీనికి బాలాజీ బ్యాగేజ్ సెంటర్ గా నామకరణం చేశారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడకదారి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద దీనికి సంబంధించిన కేంద్రాలు ఉంటాయి. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.