నోరు మూసుకుని చూడడమే..: విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్
- హిట్, ఫ్లాప్ లకు చిరంజీవి, రజనీకాంత్ అతీతం
- వరుస ఫ్లాప్ లు పడినా, ఒక్క హిట్ తో బలంగా తిరిగొస్తారని వ్యాఖ్య
- పరిశ్రమలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్న అభిప్రాయం
చాలా రోజుల విరామం తర్వాత విజయ్ దేవరకొండ కాస్తంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంతతో జంటగా నటించిన ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పుడు విజయ్ బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండకు ఓ ప్రశ్న ఎదురైంది. చిరంజీవి పట్ల జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దీనికి విజయ్ గట్టిగానే బదులిచ్చాడు.
’’సూపర్ స్టార్స్ అయిన రజనీకాంత్, చిరంజీవి ఫ్లాప్, హిట్స్ కు అతీతం. రజనీకాంత్ సర్ 5-6 వరకు ఫ్లాప్ లు ఇచ్చారు. కానీ జైలర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తిరిగొచ్చారు. కనుక మనం నోరు మూసుకుని సినిమా చూడాలి’’
‘‘చిరంజీవి కూడా వరుసగా ఆరేడు ఫ్లాఫ్ లు ఇచ్చారు. సరైన దర్శకుడు చిరంజీవి సత్తాను సరిగ్గా ఉపయోగించుకుంటే సెన్సేషనల్ సినిమాతో తిరిగొస్తారు. చిరు సర్ పరిశ్రమనే మార్చేశారు. ఆయన వచ్చిన తర్వాత యాక్షన్, డ్యాన్స్, పనితీరు మొత్తం మారిపోయింది. ఎంతో మంది సినిమా వైపు వచ్చేందుకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు’’ అని విజయ్ దేవరకొండ సమాధానమిచ్చాడు. నటులను ఫ్లాప్ లు, హిట్ ల ఆధారంగా జడ్జ్ చేయవద్దని విజయ్ కోరాడు. ఎంతో మంది పరిశ్రమ వైపు వచ్చేలా స్ఫూర్తినిచ్చినందుకు వారిని (చిరంజీవి, రజనీకాంత్) గౌరవించాలని సూచించాడు.