మెటా కీలక నిర్ణయం... త్వరలో వెబ్ లోనూ 'థ్రెడ్స్'

  • గత నెలలో ట్విట్టర్ తరహా యాప్ తీసుకువచ్చిన మెటా
  • థ్రెడ్స్ కు తొలినాళ్లలో విపరీతమైన స్పందన
  • అనూహ్య రీతిలో పతనం
  • ప్రస్తుతం థ్రెడ్స్ కు 10 మిలియన్ల యూజర్లు
  • ట్విట్టర్ కు 396 మిలియన్ల యూజర్లు
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ తరహాలోనే ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా థ్రెడ్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ను తొలుత మొబైల్  వినియోగదారులకే పరిమితం చేసిన మెటా... ఇప్పుడు నెటిజన్లకు శుభవార్త చెప్పింది. మరి కొన్నిరోజుల్లో థ్రెడ్స్ వెబ్ వెర్షన్ ను తీసుకురానున్నట్టు వెల్లడించింది. మెటా కుటుంబంలోని ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మసూరీ ఈ మేరకు నిర్ధారించారు. 

ట్విట్టర్ కు పోటీ అవుతుందని భావించిన థ్రెడ్స్ గత నెల మొదటివారంలోనే అందుబాటులోకి వచ్చింది. తొలినాళ్లలో 100 మిలియన్ల డౌన్ లోడ్లతో దూసుకెళ్లిన ఈ యాప్ కొన్నిరోజుల్లోనే అనూహ్యంగా పతనమైంది. ప్రస్తుతం థ్రెడ్స్ కు 10 మిలియన్ల యూజర్లే ఉన్నారు. అదే సమయంలో ట్విట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా 396 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.


More Telugu News