టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లోకి రేఖా నాయక్?

  • ఖానాపూర్ టిక్కెట్ ఇవ్వని బీఆర్ఎస్ అధిష్ఠానం
  • రేఖా నాయక్ కాంగ్రెస్‌లోకి వెళ్తారని జోరుగా ప్రచారం
  • ఇప్పటికే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రేఖా నాయక్ భర్త
తనకు టిక్కెట్ దక్కకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఈ రోజు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఏడు చోట్ల మినహా మిగతా అన్నిచోట్లా సిట్టింగ్‌లకు అవకాశమిచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆమె పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆమె భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో రేపు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిసే అవకాశముందని తెలుస్తోంది. టిక్కెట్ పై హామీ తీసుకొని పార్టీలో చేరుతారని తెలుస్తోంది.


More Telugu News