తెలంగాణలో 3.06 కోట్ల మంది ఓటర్లు
- తెలంగాణలో 3,06,42,333 కోట్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపిన ఎన్నికల సంఘం
- 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళా ఓటర్లు
- హైదరాబాద్‌లో చార్మినార్‌లో అత్యల్పంగా 2.16 లక్షల ఓటర్లు
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇందులో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు, ఇతరులు 2,133 మంది ఉన్నారు.
రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2,742 మంది ఎన్నారైలు, సర్వీస్ ఓటర్లు 15వేలకు పైగా ఉన్నారు.
18 నుండి 19 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు 4,76,597 మంది ఉన్నారు. జనవరిలో ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 2.99 కోట్లు. ఆ తర్వాత 8 లక్షలకు పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారు. కోటి మందికి పైగా తొలగించారు.
ముసాయిదాపై సెప్టెంబర్ 19న అభ్యంతరాలు, వినతులు సమర్పించవచ్చునని సీఈవో తెలిపారు. అర్హత ఉండి, ఓటు హక్కు లేనివారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, అక్టోబరు 4న ఓటర్ల తుది జాబితా వెలువరించనున్నారు.
హైదరాబాద్‌లో 40 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈవో తెలిపారు. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.56 లక్షలు, అత్యల్పంగా చార్మినార్‌లో 2.16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.