ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

  • ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిథిగా జగన్ హాజరు
  • పెండింగ్‌ డీఏను దసరా కానుకగా ఇస్తామని జగన్ హామీ
  • వైద్య రంగంలోని మహిళా ఉద్యోగులకు మరో ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు
విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు. ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను దసరా కానుకగా ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.

వైద్య రంగంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు అడిగినవన్నీ ఇవ్వలేకపోవచ్చని, కానీ ప్రభుత్వం తమదని ఉద్యోగులు భావించాలని కోరారు. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌ 
(జీపీఎస్‌) పై త్వరలోనే ఆర్డినెన్స్ వస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి భారం పడకుండా, ఉద్యోగులకు నష్టం లేకుండా జీపీఎస్‌ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

2019 నుంచి ఇప్పటిదాకా 3.19 లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించామని వివరించారు. 2.06 లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని చెప్పారు. వేతనాలపై రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.


More Telugu News