నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పైకి 'భోళాశంకర్'

  • ఈ నెల 11న విడుదలైన 'భోళాశంకర్ '
  • థియేటర్ల నుంచి దక్కని ఆదరణ 
  • ఒరిజినల్ కథలో చేసిన మార్పులే మైనస్ అనే టాక్ 
  • సెప్టెంబర్ 18 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్    
చిరంజీవి కథానాయకుడిగా నిర్మితమైన 'భోళా శంకర్' రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ సినిమా, మెగా అభిమానులను నిరాశపరిచింది. వీకెండ్ తరువాత వసూళ్లు కూడా బాగా పడిపోయాయి. నిర్మాతకి భారీ నష్టం తప్పదనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ సినిమాను సెప్టెంబర్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారని అంటున్నారు. అంటే 'వినాయక చవితి' పండుగ సందర్భంగా ఈ సినిమాను వదలనున్నారని సమాచారం. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావొచ్చని భావిస్తున్నారు. 

ఎప్పుడో వచ్చిన 'వేదాళం' సినిమాకి ఇప్పుడు రీమేక్ ఏంటి? అనే ఒక అసంతృప్తి చాలామందిలో ఉంది. ఈ సినిమా కోసం తీసుకున్న రెండేళ్ల సమయంలో కొత్త కథనే రెడీ చేసుకోవచ్చుగదా? అనే విమర్శలు కూడా వినిపించాయి. చివరికి కథలో చేసిన మార్పులే సినిమాను దెబ్బకొట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 



More Telugu News