ఉరవకొండలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో మరో ఉన్నతాధికారి సస్పెన్షన్

  • అక్రమంగా ఓట్లను తొలగించారంటూ ఎన్నికల సంఘానికి పయ్యావుల ఫిర్యాదు
  • ఇప్పటికే సస్పెండ్ అయిన జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి
  • తాజాగా గత సీఈవో శోభా స్వరూపరాణిపై సస్పెన్షన్ వేటు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్లను అక్రమంగా తొలగించిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులపై చర్యలకు దిగింది. ఇప్పటికే అనంతపురం జిల్లాపరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. తాజాగా మరొకరిపై వేటు పడింది. గతంలో జడ్పీ సీఈవోగా ఉన్న శోభా స్వరూపరాణిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021లో ఆమె జడ్పీ సీఈవోగా ఉన్నారు. ఆ సమయంలో అక్రమంగా 1,796 ఓట్లను తొలగించడంపై తాజాగా చర్యలు తీసుకున్నారు. స్వరూపరాణి ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఎక్స్ టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ కు గెజిటెడ్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేస్తున్నారు.


More Telugu News