తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం

  • ఇటీవల ఓ బాలికపై దాడిచేసి చంపేసిన చిరుత
  • ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • శని, ఆదివారాల్లో సంచరిస్తూ కెమెరాలకు చిక్కిన రెండు చిరుతలు, ఎలుగుబంట్లు
తిరుమల నడకమార్గంలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైంది. అలిపిరి మార్గంలో ఇటీవల ఓ బాలికపై చిరుత దాడిచేసి చంపేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాల్లో వీటి సంచారం రికార్డయింది.   

నడకమార్గంలోని ఏడో మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో శుక్ర, శనివారాల్లో అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి, రెండు చిరుతలు సంచరిస్తూ కనిపించాయి. నిన్న సాయంత్రం నరసింహస్వామి ఆలయ సమీపంలోనూ ఎలుగుబంటి సంచరించింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు నడకదారి భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టారు.


More Telugu News